Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నేనైతే అలా అనుకోవడం లేదు: ధావన్‌పై విరాట్ కోహ్లీ

Posted by:
Published: Wednesday, November 18, 2015, 14:37 [IST]

బెంగళూరు: భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి ఆటగాడని, అతను ఫాంలోనే ఉన్నాడని భారత్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం నాడు చెప్పాడు. వర్షం కారణంగా బెంగళూరులోని రెండో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. మూడో టెస్ట్ నాగపూర్‌లో 25న ప్రారంభం కానుంది.

రెండో టెస్ట్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించిన అనంతరం కోహ్లీ విలేకరులతో మాట్లాడాడు. ధావన్ పైన ప్రశంసలు కురిపించాడు. అతను గాలేలో 134, బంగ్లాదేశ్‌లో 173 పరుగులు చేశాడని గుర్తు చేశాడు. అతను ఇటీవల రెండుసార్లు సెంచరీలు చేసినా ఫాం లేదని చెప్పడం విడ్డూరమన్నాడు.

మొహాలిలో జరిగిన తొలి టెస్టులో ధావన్ రెండుసార్లు డకౌట్ అయ్యాడు. రెండో టెస్టు ప్రారంభమైన తొలిరోజు ధావన్ 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. ఈ నేపథ్యంలో ధావన్ ఫాంపైన విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించాడు.

Shikhar Dhawan is an impact player, he is not out of form: Virat Kohli

ఒకటి రెండు ఇన్నింగ్సులలో ఫెయిల్ అయినంత మాత్రాన ఎవరినీ తక్కువగా అంచనా వేయవద్దని చెప్పాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ అని, అతను ఇంకా ఎన్నో ఆడాల్సి ఉందన్నాడు. ఓపిక ఉండాలన్నాడు. అతను టీంలో ప్రభావవంతమైన ఆటగాడు అని చెప్పాడు. అతను ఫాంలో లేడని తాను భావించడం లేదన్నాడు.

అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పాడు. బెంగళూరులో తన ఆట తీరు పైన ధావన్ కచ్చితంగా సంతృప్తిగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టు కొనసాగి ఉంటే ధావన్ 70 నుంచి 80 పరుగులు లేదా సెంచరీ కూడా చేసి ఉండేవాడేమో అన్నాడు.

29 ఏళ్ల శిఖర్ ధావన్ 17 టెస్టులు ఆడాడు. 1,203 పరుగులు చేశాడు. అతని సగడు 43. నాలుగు సెంచరీలు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2013 మార్చిలో మొహాలీలో ఆస్ట్రేలియా పైన మ్యాచ్‌తో టెస్టుల్లోకి ఎంటరయ్యాడు. అప్పుడు అతను 187 పరుగులు చేశాడు.

English summary
Shikhar Dhawan is an impact player, he is not out of form: Virat Kohli
మీ వ్యాఖ్య రాయండి