Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

డివిల్లీయర్స్ క్లిష్టమైన బ్యాట్స్‌మెన్, కష్టమే: జాన్సన్

Posted by:
Published: Thursday, November 19, 2015, 12:51 [IST]

పెర్త్: ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్... తన కెరీర్‌లో క్లిష్టమైన బ్యాట్స్‌మెన్ ఎవరో చెప్పాడు. తన అంతర్జాతీయ కెరీర్లో ఎవరి బ్యాటింగ్‌లో బౌలింగ్ చేసేందుకు ఇబ్బందిగా భావించాడో తెలియజేశాడు.

న్యూజిలాండ్‌తో పెర్త్‌లో జరిగిన రెండో టెస్ట్ అనంతరం నవంబర్ 17వ తేదీన మిచెల్ జాన్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల జాన్సన్ ఈ సిరీస్‌లో అడిలైడ్ టెస్టులో ఆడనున్నాడు. ఇతను 73 టెస్టులు, 153 వన్డేలు, 30 ట్వంటీ 20లు ఆడాడు.

 Mitchell Johnson reveals the most difficult batsman he bowled at

మిచెల్ జాన్సన్ మాట్లాడుతూ... దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీయర్స్ క్లిష్టమైన బ్యాట్సుమెన్ అని చెప్పాడు. అతను అసాధారణ ఆటగాడని, అతని ఔట్ చేయడం కష్టమని అభిప్రాయపడ్డాడు. డివిల్లీయర్స్‌ను ఔట్ చేయడం పెద్ద సవాల్ అన్నాడు.

 Mitchell Johnson reveals the most difficult batsman he bowled at

2014లో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్ సమయంలో తాను కొన్ని వికెట్లు తీశానని, ఆ తర్వాత డివిల్లీయర్స్ బ్యాటింగ్‌కు వచ్చాడని, అతడు ప్రశాంతంగా ఉన్నాడని, తన సహజ ధోరణిలో ఆడుతున్నాడని చెప్పాడు. తాను చూసిన వారిలో అతను ఓ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అన్నాడు.

English summary
Recently retired Australian fast bowler Mitchell Johnson has revealed who was the toughest batsman to bowl at, during his international career.
మీ వ్యాఖ్య రాయండి