Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జాగ్రత్తగా వినండి, ఇలా ఆడాలి: ద్రవిడ్ (ఫోటో)

Posted by:
Published: Friday, November 20, 2015, 16:15 [IST]

అండర్-19 ముక్కోణపు సిరిస్ కోల్‌కత్తాలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అండర్-19 జట్టు ఆటగాళ్లు జదవ్‌పుర్ యూనివర్సిటీలోని సాల్ట్ లేక్ క్యాంపస్‌లో ప్రాక్టీస్ చేశారు. అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లకు సలహాలిస్తూ కనిపించారు.

ఈ సందర్భంగా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, వారిని రాటు దేల్చడమే తన బాధ్యత అని తెలిపారు. జట్టు ఎంపికలో తన పాత్ర ఉండదని, జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో తాను కలగజేసుకోనని చెప్పారు.

Before tri-series, a Rahul Dravid masterclass for India U-19

అండర్-19 జట్టు ఆటగాళ్లను సానబట్టడమే తన కర్తవ్యమని తెలిపారు. తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ సమయంలో గెలుపు ఓటములు ప్రభావం చూపవని అన్నారు.

ఈ ముక్కోణపు సిరిస్‌లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లతో భారత్ ఆడునుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే అండర్-19 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను సన్నాహక సిరిస్‌గా భారత్ ఉపయోగించుకుంటోంది.

English summary
On Wednesday, at Jadavpur University’s Salt Lake Campus ground, the Indian Under-19 boys gathered around their coach after playing a practice game among themselves. Rahul Dravid was giving a team talk and the youngsters were all ears. They were a privileged lot, learning from the legend himself. Over the next couple of months they will hopefully try and get more from him as they prepare for the Under-19 World Cup in January-February.
మీ వ్యాఖ్య రాయండి