Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అభిమానులూ! వెయిట్: ఇండో-పాక్ సిరీస్‌పై ఠాకూర్

Posted by:
Published: Friday, November 20, 2015, 11:55 [IST]

ముంబై: పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడే విషయమై రానున్న రోజుల్లో తేలుతుందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ భవితవ్యంపై అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

భారత్‌లో సిరీస్‌ ఆడాలన్న బీసీసీఐ సూచనను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) తిరస్కరించిన విషయం తెలిసిందే. అన్ని దేశాలు ఆడుతున్నట్లే యూఏఈలోనే తమతో సిరీస్‌ ఆడాలని కోరింది.

Indo-Pak series: Fresh talks to take place in couple of days, says Thakur

గురువారం బోర్డు అధికారుల సమావేశం నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రికెట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించారు. దానికి అనురాగ్ మాట్లాడుతూ... అభిమానులు కొన్ని రోజులు ఆగాలన్నాడు. మరికొద్ది రోజుల్లో పిసిబితో బిసిసిఐ మరోసారి చర్చించే అవకాశాలున్నాయని చెప్పాడు.

English summary
The cricket fans will have to wait a few more days to find out whether the iconic bilateral series between arch-rivals India and Pakistan would go ahead next month.
మీ వ్యాఖ్య రాయండి