Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జోడీ దొరకలేదు, అందుకే ప్రయోగాలు: విరాట్ కోహ్లీ

Posted by:
Published: Friday, November 20, 2015, 16:29 [IST]

బెంగళూరు: భారత జట్టుకు ఇంకా సరైన జోడీ దొరకలేదని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అందువల్లే జట్టులో ప్రయోగాలు చేయవలసి వస్తుందని చెప్పాడు. తొలి టెస్టులో అమిత్ మిశ్రా ఆడినా, తదుపరి టెస్టుకు ఆడించక పోవడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు.

సరైన జోడీ దొరకక పోవడం వల్ల ఆటగాళ్లు జట్టు అవసరాలకు తగినట్లు ఆడవలసి వస్తుందని చెప్పాడు. పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేయవలసి ఉంటుందన్నాడు. కచ్చితంగా ఫలానా వారిని జట్టుకు ఎంపిక చేయాలని మూర్ఖంగా వ్యవహరించమన్నాడు.

We have no set combination for our team: Virat Kohli

కొన్ని సంవత్సరాల నుంచి అమిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. ఆయా పరిస్థి్తుల్లో జట్టుకు రవీంద్ర జడెజా, స్టువార్ట్ బిన్నీ అవసరం ఉందని సెలక్టర్లు భావిస్తే ఆ పరిస్థితిని మిశ్రా అర్థం చేసుకుంటాడని చెప్పాడు. ఇద్దరు ఆల్ రౌండర్లను ఆడించవద్దనే నిబంధన ఏమీ లేదన్నాడు. జట్టులో ఇంకా సరైన కాంబినేషన్ అంటూ సెట్ కాలేదన్నాడు.

English summary
India Test captain Virat Kohli has said that there is no set combination in the team and that everyone is ready to put their hand up and perform whenever needed.
మీ వ్యాఖ్య రాయండి