Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సంతాపం: ఈడెన్ గార్డెన్స్‌పై 'ఫ్రెంచ్' పతాకం

Posted by:
Published: Monday, November 23, 2015, 11:08 [IST]

కోల్‌కత్తా: పారిస్ ఉగ్రవాద దాడి బాధితులకు సంఘీభావంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంపై ఫ్రెంచ్ జాతీయ పతాకంలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన లైట్స్‌ను ప్రదర్శించారు.

శనివారం నుంచి ప్రారంభమైన ఈ లైటింగ్, ఈ నెలాఖరు వరకు వెలిగిస్తామని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా తెలిపారు. ‘పారిస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి తెలిపేందుకు మా ప్రయత్నమిది. ప్రతీ రోజు రాత్రి 10 గంటల వరకు మూడు రంగుల విద్యుత్ వెలుగులు ప్రకాశిస్తాయి' అని ఆయన చెప్పారు.

Eden Gardens lit up in colours of French flag

అంతక ముందు కోల్‌కత్తాలో చారిత్రక కట్టడాలైన విక్టోరియా మెమోరియాల్, షాహిద్ మినార్‌లపై కూడా ఇదే విధంగా లైటింగ్ ఏర్పాటు చేసిన పారిస్ ఉగ్రవాద దాడి బాధితులకు తమ వంతుగా సంఘీభావం తెలియజేశారు.

ఈ నెల 13న ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో వంద మందికి పైగా మృతి చెందగా, 350 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

English summary
India’s iconic cricket stadium Eden Gardens has lit up its facade in blue, white and red, the French Tricolour, in a show of solidarity with last week’s Paris terrorist attack victims.
మీ వ్యాఖ్య రాయండి