Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ట్విట్టర్లో ధోనీతో కూతురు జీవా: ఫ్యాన్స్ ఆనందం

Posted by:
Published: Monday, November 23, 2015, 9:21 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కూతురు జీవాను ఎత్తుకున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమ కూతురును చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు ధోనీ దంపతులు.

రెండు చేతులతో జీవాను ఎత్తుకుని ఉన్న ఈ ఫొటోలో ధోనీ నవ్వుతూ పోజిచ్చాడు. జీవా కూడా చక్కగా ఫొటోకు పోజిచ్చింది. ధోనీ కూతురు జీవాను ఎత్తుకుని తీయించుకున్న ఈ ఫోటో ఇప్పుడు నెట్లో చక్కర్లు కొడుతోంది.

MS Dhoni's daughter Ziva's latest snapshots!

కాగా, జీవా ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ట్విటర్లో అభిమానులతో పంచుకుంటూనే ఉంది ధోని భార్య సాక్షి. ఆర్మీ వాళ్లు ధరించే క్యామో దుస్తులంటే మహీకి ఎంతో ఇష్టం. ధోనీ వాటిని ధరించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ వన్డే, టీ 20ల్లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

English summary
MS Dhoni & daughter Ziva will make you say 'Awww' in new picture shared by Sakshi!
మీ వ్యాఖ్య రాయండి