Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

4 పరుగులిచ్చి 4 వికెట్లు: ఎవరీ అవేష్ ఖాన్?

Posted by:
Published: Monday, November 23, 2015, 10:50 [IST]

కోల్‌కత్తా: ముక్కోణపు సిరిస్‌లో భాగంగా బంగ్లాదేశ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు ఓవర్లు వేసి 4 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 6.2 అడుగుల ఎత్తున్న అవేష్ ఖాన్ వయసు 18 సంవత్సరాలు. అతని పేరే అవేష్ ఖాన్.

పదునైన ఆఫ్‌ కట్టర్స్‌తో ముక్కోణపు సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై భారతకు ఒంటిచేత్తో ఘన విజయం అందించాడు. భారత అండర్ 19 క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్. అంతేకాదు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జట్టు పేసర్లలో చాలా మందికి సాధ్యం కాని వేగాన్ని నమోదు చేశాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అవేష్ ఖాన్ తన బౌలింగ్‌లో 139.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. జదవ్ యూనివర్సిటీలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అండర్ 19 జట్టు బంగ్లాదేశ్‌పై 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 With 4 for 4, speedy Avesh Khan makes quick work of Bangladesh

6 ఓవర్లు వేసిన అవేష్ ఖాన్ 3 మెయిడెన్లు, 4 పరుగులతో నాలుగు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం నీ ఆరాధ్య క్రికెటర్ ఎవరంటే, ఎవరి పేరూ చెప్పకుండా, తాను ఎంతో మంది ఆటను చూస్తూ పెరిగానని, తాను ప్రత్యేకంగా ఉండాలన్నదే తన అభిమతమని ఇండోర్‌కు చెందిన అవేష్‌ చెబుతున్నాడు.

‘ప్రస్తుతం నా బౌలింగ్‌ వేగం ఎంతుందో తెలియదు. ఇక్కడ దాన్ని కొలవడం లేదు. కానీ, యూఏఈలో గతేడాది జరిగిన వరల్డ్‌క్‌పలో మాత్రం 139.8 వేగం నమోదు చేశాన'ని పేర్కొన్నాడు. ఇండోర్‌లో భారత మాజీ లెఫ్టాండర్‌ అమయ్‌ ఖురాసియా శిక్షణలో వెలుగులోకొచ్చాడు.

రాహుల్‌ ఆటను స్పష్టంగా చదువుతారని, ఏ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి బంతులు వేయాలో చెబుతారని ఇండోర్‌ వ్యాపారవేత్త కుమారుడైన ఖాన్‌ చెప్పాడు. ‘గతంలో చాలా సార్లు నేను తొలి బంతికే వికెట్‌ పడగొట్టా. కానీ, అంతర్జాతీయ మ్యాచ్‌లో అలా చేయలేదు. ఇది నాకు చాలా ప్రత్యేకంగా గుర్తుంటుంద'ని తెలిపాడు.

బౌలింగ్‌లో మరింత వేగాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు చెప్పాడు. మీడియం పేసర్‌గా ఉండటం తనకిష్టం లేదని, ఫాస్ట్ బౌలింగే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఇక అవేష్ ఖాన్ తండ్రి ఓ ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగిగా ఉన్నారు.

14 ఏళ్ల వయసులో ఇండోర్‌ కోల్ట్స్‌ క్రికెట్‌ క్లబ్‌లో చేరాడు. అయితే స్టేట్‌ అకాడమీలో అవేష్‌ను చూసిన ఖురాసియా అతణ్ణి తన శిష్యుడిగా ఎంచుకున్నాడు. ‘ఈ రోజు ఖురాసియా వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. ఆయన ఒక మార్గదర్శి. నన్ను బాగా ప్రోత్సహిస్తార'ని అవేష్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

తన కుమారుని పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అండర్ 19 జట్టుకు రాహుల్ ద్రవిడ్ లాంటి లెజెండ్ కోచ్‌గా రావడం అవేష్ చేసుకున్న పుణ్యమని పేర్కొన్నారు. ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా తనకు అనుకూలంగా మార్చుకోవడం అవేష్‌ ప్రత్యేకతన్నారు.

English summary
Last year, at the Under-19 World Cup in the UAE, Avesh Khan had clocked 139.8kph, bowling with a bruised ankle against Pakistan. He didn’t make a big impact, returning with 0/50 from eight overs. But it was serious pace for a bowler of his age. He was only 17 then.
మీ వ్యాఖ్య రాయండి