Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

3వ టెస్ట్: 215కే భారత్ ఆలౌట్, దక్షిణాఫ్రికా 11/2

Posted by:
Updated: Wednesday, November 25, 2015, 17:20 [IST]

నాగ్‌పూర్: భారత్ తొలి ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. వాన్‌జిల్ ఔట్ అనంతరం నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన ఇమ్రాన్ తాహిర్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో క్లీబ్ బౌల్డయ్యాడు.

అంతక ముందు 4 పరుగులకే దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. స్పిన్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో వాన్‌జిల్‌ పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో డీన్ ఎల్గార్ 7, హషీమ్ ఆమ్లా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 215 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు సత్తా చాటారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాట్స్‌మెన్లు పరుగుల వేటలో తడబడ్డారు.

భారత్-దక్షిణాఫ్రికా 3వ టెస్టు లైవ్ స్కోరు కార్డు

ఓపెనర్లు మురళీ విజయ్ 40, శిఖర్ ధావన్ 12, కెప్టెన్ కోహ్లీ 22, ఛటేశ్వర్ పుజారా 21, అజింక్యా రెహానే 13, రోహిత్ శర్మ 2, సాహా 32, రవీంద్ర జడేజా 34, అశ్విన్ 15, మిశ్రా 3లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సఫారీ బౌలర్లలో మోర్నె మోర్కెల్ మూడు వికెట్లు తీసుకోగా, షిమోన్ హార్మర్ నాలుగు, తహీర్, ఎల్గర్, రబాడ తలో వికెట్ తీసుకున్నారు.

3rd Test: India opt to bat first on dry pitch; Rohit, Mishra return

మ్యాచ్ సమ్మరీ:

జట్టు స్కోరు 201 పరుగుల వద్ద సాహా రూపంలో టీమిండియా 8వ వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 76 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. జట్టు స్కోరు 173 పరుగుల వద్ద రవీంద్ర జడేజా రూపంలో భారత్ 7వ వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో జడేజా 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు.

రెండో సెషన్ ముగియడానికి ముందే టీమిండియా 6 వికెట్లను కోల్పోయి 149 పరుగులు చేసింది. బిన్నీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ 28 బంతులాడి రెండు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. 44 ఓవర్లకు గాను టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 22, రహానే 13 పరుగుల వద్ద మోర్కెల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు.

టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమవడంతో జట్టు స్కోరు నెమ్మదించింది. జట్టు స్కోరు 94 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. పూజారా 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్మర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు.

ఫ్రీడమ్ సిరిస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు మ్యాచ్ నాగ్ పూర్‌లో బుధవారం ప్రారంభమైంది. 23 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్లను కోల్పోయి 71 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు.

సఫారీల బౌలింగ్‌ను ఎదుర్కొలేక టీమిండియా మరో ఓపెనర్ మురళీ విజయ్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోరు 69 పరుగులుగా ఉంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 50 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

3rd Test: India opt to bat first on dry pitch; Rohit, Mishra return

డీన్‌ ఎల్గర్‌ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన శిఖర్‌ ధావన్‌ (12) ఎల్గర్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్ఫిన్నర్లు, ఒక పేసర్‌తో బరిలోకి దిగింది. వరుణ్ ఆరోన్, రోజర్ బిన్నీ స్ధానంలో రోహిత్ శర్మ, అమిత్ మిశ్రాలకు చోటు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లిసేన సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది.

తొలి టెస్టులో టీమిండియా నెగ్గినా, బెంగుళూరు టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి సిరిస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో కోహ్లీ సేన ఉంది.

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ.

దక్షిణాఫ్రికా: హషీమ్ ఆమ్లా (కెప్టెన్), ఎబి డివిలియర్స్, డీన్ ఎల్గార్ ఫాఫ్ డు ప్లెసిస్, జెపి డుమినీ, సైతాన్ వాన్, డేన్ విలాస్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, ఇమ్రాన్ తాహిర్, మోర్న్ మోర్కెల్, కగిసో రబాడ.

Story first published:  Wednesday, November 25, 2015, 9:28 [IST]
English summary
On a dry pitch, India captain Virat Kohli won the toss and elected to bat first against South Africa in the 3rd Test here today.
మీ వ్యాఖ్య రాయండి