Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంతి ఎలా కనిపిస్తుందో అన్న ఆందోళన: కోహ్లీ

Posted by:
Published: Wednesday, November 25, 2015, 9:01 [IST]

నాగ్‌పూర్: ఐదు రోజుల టెస్టు గేమ్‌ను డే/నైట్ నిర్వహించడం ఓ గొప్ప ముందడుగు అని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. తొలి అంతర్జాతీయ డే/నైట్ టెస్టు విజయవంతం కావాలని విరాట్ కోహ్లీ ఆకాంక్షించాడు.

తొలి అంతర్జాతీయ డే/నైట్ టెస్టు నవంబర్ 27 (శుక్రవారం) ఆస్టేలియా, న్యూజిలాండ్ మధ్య అడిలైడ్‌లో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా 3వ టెస్టు ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ మాట్లాడారు.

Virat Kohli

'గులాబీ బంతితో ఆడిన వాళ్ల అభిప్రాయం తెలుసుకున్నా. ఫ్లడ్ లైట్ల వెలుగులో బంతి ఎలా కనిపిస్తుందో అన్న ఆందోళన ఉండేది. అయితే దాంతో ఇబ్బందేమీ లేదని తెలిసింది. డే/నైట్ టెస్టు నిర్వహణ ఓ మైలురాయి. టెస్టు క్రికెట్‌ను మార్చే దిశగా ఇది పెద్ద ముందడుగు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని, ఆటను మెరుగుపరచడానికి ఉపయోపగపడుతుందని ఆశిస్తున్నా. ఈ ప్రయోగానికి ఒప్పుకున్న రెండు జట్లకు అభినందనలు' అని కోహ్లీ అన్నాడు.

English summary
Calling it a "big step" towards changing Test cricket, India captain Virat Kohli today hoped the idea of day-night five-day games works out. Australia and New Zealand are set to play the first-ever day-night Test in Adelaide from Friday (November 27).
మీ వ్యాఖ్య రాయండి