Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ట్వంటీ20: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భారత్ ఆటగాళ్లు?

Posted by:
Published: Wednesday, November 25, 2015, 14:38 [IST]

ముంబై: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భారత్ క్రికెట్ ఆటగాళ్లు పాల్గొనేందుకు అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధమని ఐపీఎల్ చైర్మన్, బిసిసిఐ కోశాధికారి రాజీవ్ శుక్లా అన్నాడు. తమ పిఎస్ఎల్‌లో భారత్ ఆటగాళ్లను ఆడించేందుకు అనుమతివ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరితే చూస్తామని చెప్పాడు.

వారు తమను కోరినప్పుడు దాని గురించి ఆలోచిస్తామని చెప్పారు. పిఎస్ఎల్ చీఫ్ నజామ్ సేథీ ఇటీవల మాట్లాడుతూ... పిఎస్ఎల్ ట్వంటీ 20 లీగ్‌లో కొందరు భారత ఆటగాళ్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

If Pakistan wants Indian players in PSL, we can look into it: Rajeev Shukla

పిఎస్ఎల్ లీగ్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుంది. దుబాయ్, షార్జా వేదిక కానుంది. కాగా, పిసిబి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) లీగ్ విషయమై ఇంకా పూర్తి విషయాలు చెప్పవలసి ఉంది. స్పాన్సర్స్, బ్రాడ్ కాస్టింగ్ ఎవరికిచ్చారు తదితర అంశాలపై త్వరలో తెలియజేయనుంది.

బిసిసిఐ నియమం ప్రకారం టీమిండియా ఆటగాళ్లు ఇతర దేశాల లీగ్‌లలో ఆడవద్దు. అయితే, రాజీవ్ శుక్లా మాత్రం.. పిసిబి కోరితే తాము ఆలోచిస్తామని చెప్పారు. భారత్ - పాక్ సిరీస్ పైన స్పందిస్తూ... పాకిస్తాన్‌తో తాము తగిన భద్రత ఉన్నచోట ఆడాలనుకుంటున్నామని రాజీవ్ శుక్లా అన్నాడు.

English summary
IPL Chairman and BCCI functionary Rajeev Shukla has claimed that the Indian Board is open to considering any request from its Pakistan counterpart seeking permission for its players' participation in the Pakistan Super League (PSL).
మీ వ్యాఖ్య రాయండి